రావణుడి పాత్రకు ఆ స్టార్ ఓకే అంటాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న మూడు సినిమాలు ప్యాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. రాధేశ్యామ్ చిత్రీకరణలో ఉండగా నాగ్ అశ్విన్ సినిమా సెట్స్‌పై ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తాజా చిత్రం ఓంరావుత్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్‌ను ఖరారు చేసి అనౌన్స్ చేశారు. ఇది రామాయణం అని.. రాముడిగా ప్రభాస్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రభాస్ ఆదిపురుష్ రామాయణమే అయితే మరి సీతగా ఎవరు నటిస్తారు? రావణాసురుడుగా ఎవరు నటిస్తారనే వార్తలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడటం తొందపాటే అయినా.. సినిమాలో నటించబోయే తారాగణం గురించి వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
లేటెస్ట్ సోషల్ మీడియా వర్గాల సమాచారం మేరకు ప్రభాస్ ఆదిపురుష్‌లో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా నటిస్తారట. ఓం రావుత్ గత చిత్రం తానాజీలో సైఫ్ ఆలీఖాన్ విలన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మరోసారి ఓం రావుత్ కోరడంతో రావణాసురుడుగా నటించడానికి సైఫ్ ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజా నిజాలు తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com