యూట్యూబ్‌లో ఇకపై ఈ ఆప్షన్ కనిపించదు..

  • IndiaGlitz, [Thursday,April 01 2021]

యూట్యూబ్.. నెటిజన్ల జీవితంలో భాగమైపోయింది. దీని ద్వారా నిత్యం లక్షల రూపాయల్లో పలువురు సంపాదించుకుంటున్నారు. అలాగే ఏ సినిమా రిలీజ్ అయినా.. ఏ వేడుక జరిగినా యూట్యూబ్ చూడాల్సిందే. సినిమాలు చూసేందుకు.. టీవీ కార్యక్రమాలు చూసేందుకు దేనికైనా సరే.. యూట్యూబ్ వాడాల్సిందే. అలాంటి యూట్యూబ్‌ను కొందరు మాత్రం మిస్ యూజ్ చేస్తున్నారు. ఫ్యాన్ వార్‌కి కూడా దీనినే ఎంచుకుంటున్నారు. తమకి నచ్చని హీరోకి అనవసరంగా డిస్‌ లైక్స్ ఇస్తూ లేని పోని రచ్చకు తెరదీస్తున్నారు. ఇలా డిస్ లైక్ బటన్ కారణంగా కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి.

ఇకపై ఈ అనవసర రాద్దాంతాలకు యూట్యూబ్ చెక్ పెట్టనుంది. కొంతమంది యూజర్లకు వ్యసనంగా మారిన ఈ డిస్ లైక్స్ ఇవ్వడాన్ని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వీడియోల కింద డిస్‌లైక్ ఆప్షన్ కనిపించకుండా చేయనుంది. అసలు డిస్‌లైక్ అనే సింబలే లేకుండా చేసేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే యూట్యూబ్ ప్రకటించింది. మరి యూట్యూబ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతమంది నెటిజన్లకు నచ్చుతుందో వేచి చూడాలి. ఈ క్వశ్చన్ ఒకవేళ యూట్యూబ్ వీడియోలో కనిపిస్తే దీనికి ఎన్ని డిస్‌ లైక్స్ పడతాయో...

More News

పసివాడిని పొట్టనబెట్టుకున్న వివాహేతర సంబంధం..

పాపం పుణ్యం ప్రపంచ పోకడ తెలియని పసివాడు. ఏడాదిన్నర వయసు.. తల్లి, మహా అయితే బొమ్మలే ప్రపంచం..

రాసలీలల కేసు.. అజ్ఞాతంలోకి మాజీ మంత్రి జార్కిహోళి

కర్ణాటక రాజకీయాలలో మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే.

రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. గురువారం ఉదయం కేంద్రం ఆయనకు దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది.

అక్షయ్ కుమార్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన సత్యదేవ్

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సూపర్ సక్సెస్‌తో లాక్‌డౌన్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న సత్యదేవ్.. తన స్టార్ డమ్‌ని కొనసాగిస్తూనే ఉన్నారు.

లేడీ సింగం ఆత్మహత్య కేసులో మరో అధికారి సస్పెన్షన్

మహారాష్ట్రలో వేళ్లూనుకున్న స్మగ్లింగ్ ఆట కట్టించి లేడి సింగంగా గుర్తింపు పొందిన అటవీశాఖ అధికారిణి దీపాళీ చవాన్(28) ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది.