యూట్యూబ్‌లో ఇకపై ఈ ఆప్షన్ కనిపించదు..
Send us your feedback to audioarticles@vaarta.com
యూట్యూబ్.. నెటిజన్ల జీవితంలో భాగమైపోయింది. దీని ద్వారా నిత్యం లక్షల రూపాయల్లో పలువురు సంపాదించుకుంటున్నారు. అలాగే ఏ సినిమా రిలీజ్ అయినా.. ఏ వేడుక జరిగినా యూట్యూబ్ చూడాల్సిందే. సినిమాలు చూసేందుకు.. టీవీ కార్యక్రమాలు చూసేందుకు దేనికైనా సరే.. యూట్యూబ్ వాడాల్సిందే. అలాంటి యూట్యూబ్‌ను కొందరు మాత్రం మిస్ యూజ్ చేస్తున్నారు. ఫ్యాన్ వార్కి కూడా దీనినే ఎంచుకుంటున్నారు. తమకి నచ్చని హీరోకి అనవసరంగా డిస్ లైక్స్ ఇస్తూ లేని పోని రచ్చకు తెరదీస్తున్నారు. ఇలా డిస్ లైక్ బటన్ కారణంగా కొన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి.
ఇకపై ఈ అనవసర రాద్దాంతాలకు యూట్యూబ్ చెక్ పెట్టనుంది. కొంతమంది యూజర్లకు వ్యసనంగా మారిన ఈ డిస్ లైక్స్ ఇవ్వడాన్ని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే వీడియోల కింద డిస్లైక్ ఆప్షన్ కనిపించకుండా చేయనుంది. అసలు డిస్లైక్ అనే సింబలే లేకుండా చేసేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు ఇప్పటికే యూట్యూబ్ ప్రకటించింది. మరి యూట్యూబ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతమంది నెటిజన్లకు నచ్చుతుందో వేచి చూడాలి. ఈ క్వశ్చన్ ఒకవేళ యూట్యూబ్ వీడియోలో కనిపిస్తే దీనికి ఎన్ని డిస్ లైక్స్ పడతాయో...
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout