సూర్య 24 కథ ఇదే...

  • IndiaGlitz, [Saturday,January 23 2016]

సూర్య హీరోగా మనం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్న క్రేజీ మూవీ 24. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు. సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..24 సినిమా క‌థ ఏమిట‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. అయితే తాజాగా 24 క‌థ కాస్త లీక్ అయ్యింది.
అదేమిటంటే...ఈ సినిమాలో హీరో సూర్య వాచీ రిపేర్ షాపు న‌డుపుతుంటాడ‌ట‌. సూర్య ద‌గ్గ‌ర‌కి ఓ వాచీ రిపేర్ కి వ‌స్తుంది. ఆ వాచీ ఓ టైమ్ మిష‌న్. ఆ వాచీని త‌యారు చేసిన సైంటిస్ట్ దానిని పోగొట్టుకుంటాడ‌ట‌. ఆ టైమ్ మిష‌న్ ని ఆప‌రేట్ చేస్తూ భ‌విష్య‌త్ కాలంలోకి వెళ‌తాడ‌ట సూర్య‌. ప్ర‌యాణం నేప‌ధ్యం...రోజుకి 24 గంట‌లు..దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి 24 అనే టైటిల్ పెట్టార‌ట‌. అదీ సంగ‌తి. మ‌రి... స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న 24 ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.