మహేష్ పి.వి.పి కి నో చెప్పడానికి కారణం ఇదే..!
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత కొరటాల శివతో ఓ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్నిఫిబ్రవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరటాల శివ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహేష్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందే చిత్రాన్నిపి.వి.పి సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత పి.వి.పి బ్యానర్ లో మరో సినిమా చేస్తానని మహేష్ మాట ఇచ్చారు.
అందుచేత వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమాని పి.వి.పి నిర్మించేందుకు ప్లాన్ చేసారు. మహేష్ కూడా ఓకే అన్నారు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు పి.వి.పి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో మహేష్ ఏమనుకున్నారో ఏమో...వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమాని పి.వి.పి బ్యానర్ లో కాకుండా దిల్ రాజు బ్యానర్ లోచేయాలి అని నిర్ణయం తీసుకున్నారట. దీనికి కారణం ఏమిటంటే....పి.వి.పి.తో చేస్తే ఫ్లాప్ కాంబినేషన్ అవుతుంది అదే దిల్ రాజుతో చేస్తే సక్సెస్ కాంబినేషన్ అవుతుంది అని మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.త్వరలోనే ఈ విషయం పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments