శ్రీదేవి కూతురు జాహ్నవి నటిస్తున్న సినిమా ఇదే..!

  • IndiaGlitz, [Thursday,November 17 2016]

అతిలోక సుంద‌రి శ్రీదేవి కూతురు జాహ్న‌వి సినీ రంగ ప్ర‌వేశం గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అయితే...ఏ సినిమా ద్వారా జాహ్న‌వి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది అనేది క్లారిటి లేదు. ఇక ఇప్పుడు ఈ విష‌యం పై క్లారిటి వ‌చ్చేసింది అనే చెప్పాలి. క‌ర‌ణ్ జోహార్ జాహ్న‌విని హీరోయిన్ గా ప‌రిచ‌యం చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంత‌కీ ఏ సినిమా ద్వారా అంటే....మ‌రాఠీలో 4 కోట్ల‌తో రూపొంది 100 కోట్లు క‌లెక్ట్ చేసిన సంచ‌ల‌న చిత్రం సైర‌త్. దీంతో ఈ సంచ‌ల‌న‌ చిత్రాన్ని వివిధ భాష‌ల్లో రీమేక్ చేయ‌డానికి ప్రొడ్యూస‌ర్స్ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. హిందీలో రూపొందించేందుకు క‌ర‌ణ్ జోహార్ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాహ్న‌వి న‌టించ‌నున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.