చిరు బ‌ర్త్ డే కి చ‌ర‌ణ్ ఇస్తున్న గిఫ్ట్ ఇదే..

  • IndiaGlitz, [Friday,July 22 2016]

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు (ఆగ‌ష్టు 22)ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు చ‌ర‌ణ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చిరు 150వ సినిమా చేస్తున్న‌ స‌మ‌యంలో వ‌స్తున్న‌ బ‌ర్త్ డే కావ‌డంతో ఘ‌నంగా చేసేందుకు ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం ధృవ‌. చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది.

ఈ మూవీని సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్ టీజ‌ర్ ను ఆగ‌ష్టు 15న స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌నున్నారు. ఇక చిరు బ‌ర్త్ డే సంద‌ర్భంగా ధృవ చిత్రంలోని ఒక సాంగ్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ట చ‌ర‌ణ్‌. ఇక ధృవ ఆడియోను సెప్టెంబ‌ర్ లో, చిత్రాన్ని అక్టోబ‌ర్ 7న రిలీజ్ చేయ‌నున్నారు.

More News