పవన్ కి నచ్చిన తమిళ మూవీ ఇదే..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నారు. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...పవన్ కళ్యాణ్ కి అజిత్ హీరోగా నటించిన తమిళ మూవీ వీరం తెగ నచ్చేసిందట. ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేయాలనుకుంటున్నాడట పవన్.
యాక్షన్ - ఎమోషన్ - ఎంటర్ టైన్మెంట్ సమపాళ్లలో ఉన్న వీరం సినిమా తమిళనాడులో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. సర్ధార్ సినిమా తర్వాత పవన్ ఈ సినిమానే చేయచ్చు అంటున్నారు. గతంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. సో.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థే ఈ చిత్రాన్ని నిర్మించవచ్చు. అయితే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com