అది హీరో పేరు కాదట...

  • IndiaGlitz, [Wednesday,May 04 2016]

సాయిధరమ్ తేజ్ హీరోగా పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం సుప్రీమ్. ఈ సినిమా టైటిల్ గురించి దర్శకుడు ఓ విషయాన్ని తెలియజేశాడు అదేంటంటే ఈ సినిమా టైటిల్ హీరోది కాదట. సుప్రీమ్ అనే పేరు హీరో వాడే కారు పేరట. హీరో పేరు బాలు అని చెప్పుకొచ్చాడు. అలాగే రాశిఖన్నా పోలీస్ క్యారెక్టర్ చేసిన కర్తవ్యం విజయశాంతిలా సీరియస్ గా కాకుండా నవ్విస్తూ ఉంటుందట. సాయిధరమ్ చాలా కష్టపడే హీరో సినిమా చూశాం. తప్పకుండా హిట్ కొడతాం కానీ అది ఏ రేంజ్ హిట్టో అని ఇప్పుడే చెప్పలేనంటూ అనిల్ తెలియజేశాడు.