గాలి ద్వారా కరోనా.. ఇలా చెక్ పెట్టవచ్చు..
Send us your feedback to audioarticles@vaarta.com
గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశం ఉందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎలా చెక్ పెట్టాలో తాజాగా నిపుణులు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం వైరస్ వ్యాప్తి కట్టడికి నూతన అడ్వైజరీ విడుదల చేసింది. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా చూడాలంటే తప్పనిసరిగా ఇంట్లో గాలి వెలుతురు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని చెబుతోంది. మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇండోర్లలో వెంటిలేషన్ పెంచుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని శాస్త్రీయ సలహా బృందం సూచించింది.
Also Read: కరోనా సెకండ్ వేవ్ అంతం ఎప్పుడంటే...
కరోనా సోకిన వ్యక్తి నుంచి కుటుంబంలోని ఇతరులకు సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుందని తెలిపారు. ఎగ్జాస్ట్ సిస్టమ్స్ స్థానంలో ఫ్యాన్‌ను అమరిస్తే వైరస్ సైతం బయటకు పోతుందని వెల్లడించారు. కొవిడ్ బాధితుడు మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం, నవ్వడం వంటివి చేసినప్పుడు బయటకు వచ్చే వైరస్ కణాల్లో రెండు రకాలుంటాయి. పెద్ద పెద్ద డ్రాప్లెట్స్, చిన్న చిన్న డ్రాపులెట్స్. పెద్ద వాటితో పోలిస్తే చిన్నవే ప్రమాదకరం. పెద్ద పెద్ద డ్రాపులెట్స్ నేరుగా భూ ఉపరితలంపై పడతాయి. వాటిని తాకిన చేతులతో ముఖం, నోటిని తాకితే ప్రమాదం.
అయితే చిన్న చిన్న డ్రాప్లెస్ గాలిలో దాదాపు 10 మీటర్ల వరకూ ప్రయాణిస్తాయి. వీటి ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో వెంటిలేషన్ మంచిగా ఉండేలా చూసుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. అయితే డబుల్ మాస్క్‌ను ధరిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందట. డబుల్ మాస్క్‌ను ధరించినప్పుడు క్లాత్ మాస్క్‌తో పాటు సర్జికల్ మాస్క్‌ను తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా సర్జికల్ మాస్కును క్లాత్ మాస్కుతో కలిపి వినియోగించినప్పుడు ఐదు సార్ల వరకూ వినియోగించవచ్చని.. అయితే దానిని వినియోగించి తొలగించిన వెంటనే ఎండలో ఆరబెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments