ఈ ఇయర్ ఫేస్ బుక్ హీరో..

  • IndiaGlitz, [Thursday,December 10 2015]

ఫేస్ బుక్...చూస్తే చాలు...ఎక్కువుగా ప్ర‌జ‌లు దేని గురించి మాట్లాడుకుంటున్నారో...ఇట్టే తెలిసిపోతుంది. అది రాజ‌కీయం కావ‌చ్చు..సినిమా కావ‌చ్చు..క్రికెట్ కావ‌చ్చు..మేట‌ర్ ఏదైనా స‌రే తెలిసిపోతుంది. అయితే 2015 పూర్తి అవుతుందిగా...అస‌లు ఈ సంవ‌త్స‌రంలో భార‌త్ ప్ర‌జ‌లు ఎక్కువుగా ఎవ‌రి గురించి మాట్లాడుకున్నారు..? ఎవ‌రి నామాన్ని జ‌పించారు..? ఇలాంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను సేక‌రించి ఫేస బుక్ సంస్థ ఓ జాబితాను రిలీజ్ చేసింది.

ఈ జాబితాలో మొద‌టి స్ధానంలో భార‌త ప్ర‌భాని న‌రేంద్ర‌మోడీ ఉండ‌గా రెండో స్ధానంలో ఈ కామ‌ర్స్ భూమ్, మూడ‌వ స్ధానంలో అబ్దూల్ క‌లాం ఉండ‌గా, నాలుగ‌వ స్ధానంలో బాహుబ‌లి ది బిగినింగ్ నిల‌వ‌డం విశేషం. ఐద‌వ స్ధానం నేపాల్ భూకంపం, ఆర‌వ స్ధానంలో స‌ల్మాన్ ఖాన్, ఏడ‌వ స్ధానంలో క్రికెట్, ప్ర‌పంచ క‌ప్ ఐ.పి.ఎల్, ఎనిమిద‌వ స్ధానంలో బీహార్ ఎన్నిక‌లు, తొమ్మిద‌వ స్ధానంలో దీపిక ప‌డుకునే, ప‌ద‌వ స్ధానంలో ఇండియ‌న్ ఆర్మీ నిలిచాయి. ఏది ఏమైనా ఈ సంవత్స‌రం భార‌త్ ఫేస్ బుక్ హీరోల్లో ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి 4వ స్ధానంలో నిల‌వ‌డం నిజంగా గ్రేట్.