ఈ దేవ‌దాస్‌ కూడా అంతేన‌ట‌

  • IndiaGlitz, [Friday,July 06 2018]

దేవ‌దాసు.. తెలుగు తెర‌పై నాలుగు సార్లు వినిపించిన టైటిల్ ఇది. ఇప్ప‌టికే ఈ పేరుతో మూడు సినిమాలు రాగా.. ఈ సెప్టెంబ‌ర్‌లో నాలుగో సినిమా రాబోతోంది. నాగార్జున‌, నాని క‌లిసి న‌టిస్తున్న ఈ తాజా దేవ‌దాస్‌కు శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మెలోడీ బ్ర‌హ్మ‌ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నారు. 65 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా గ‌తంలో దేవ‌దాసు పేరుతో వ‌చ్చిన చిత్రాల త‌ర‌హాలోనే మ్యూజిక‌ల్‌గానూ మెప్పించేలా ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాల స‌మాచారం.

1953లో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, సావిత్రి జంట‌గా న‌టించిన దేవ‌దాసు.. 1974లో కృష్ణ‌, విజ‌య నిర్మ‌ల జంట‌గా న‌టించిన దేవ‌దాసు.. 2006లో రామ్‌, ఇలియానా జోడీగా నటించిన దేవ‌దాసు.. మ్యూజిక‌ల్‌గా ఘ‌న‌విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఫీట్‌ని న‌యా దేవ‌దాస్ కూడా రిపీట్ చేస్తుందో లేదో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.