Bigg Boss 6 : ఆదర్శ జంటను విడదీస్తోన్న బిగ్‌బాస్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా..?
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 తెలుగు హొరాహోరీగా సాగుతున్న సంగతి తెలిసిందే. సరికొత్త టాస్కులతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. షోకి అడ్డంకిగా మారిన వారిని, కంటెంట్ లేని వారిని ఓటింగ్ ఆధారంగా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన గలాటా గీతూ, ఆర్జే సూర్య, బాలాదిత్య, వాసంతిలను బయటకు పంపారు. అప్పటి నుంచి ఆటలో వేగం పెరిగింది.
డేంజర్ జోన్‌లో ఈ ముగ్గురు:
ఈ రోజు వీకెండ్ కావడంతో ఎవరికి మూడుతుందోనని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు టెన్షన్ పడుతున్నారు. అయితే బిగ్‌బాస్ ఎపిసోడ్‌కి ముందే సోషల్ మీడియాలో కొందరు ఎలిమినేట్ అవుతున్నారో ముందే లీక్ చేసేస్తున్నారు. ఈ వైరల్ అవుతున్న వార్తలను బట్టి ఈ వారం మెరీనా అబ్రహం ఎలిమినేట్ కానున్నారట. ఈ వారం ఫైమా, రాజ్ తప్పించి రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, మెరీనా, ఇనయాలు నామినేషన్స్‌లో వున్నారు. వీరిలో మెరీనా, రోహిత్, కీర్తి డేంజర్ జోన్‌లో వుండగా.. అందరికంటే తక్కువ ఓటింగ్‌తో మెరీనా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.
కల నెరవేరకుండానే:
నిజానికి మెరీనా తొలి నుంచి బిగ్‌బాస్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మెతక కావడంతో గొడవలకు దూరంగా వుండేది, ఏ వివాదంలోనూ తలదూర్చేది కాదు. ఎప్పుడు చూసినా తన భర్త రోహిత్ వెంటే వుండేది. అయితే తర్వాతి రోజుల్లో నాగార్జున , బిగ్‌బాస్‌లు క్లాస్ పీకడంతో ఆటతీరు మార్చుకుంది. టాస్కుల్లో గెలిచేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఆమె ఎలిమినేషన్ షాకే. పైగా బిగ్‌బాస్‌లో తన భర్తతో కలిసి పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాలని మెరీనా ఎంతగానో భావించింది. దీనిపై బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్ చేసింది కూడా. మరోవైపు ఆమె ఎలిమినేట్ అయితే రోహిత్ కూడా మెంటల్‌గా వీక్ అవుతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com