బిగ్‌బాస్ రన్నర్ ఎవరో తెలిసిపోయింది!
- IndiaGlitz, [Sunday,December 20 2020]
బిగ్‌బాస్ సీజన్ 4కి నేటితో ఫుల్ స్టాప్ పడనుంది. కొన్ని వారాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ సారి సీజన్ కోసం బిగ్‌బాస్ టీం పెద్దగా ప్రేక్షకులకు తెలియని మొహాలనే ఎంచుకుంది. కాగా.. తెలిసిన మొహాలన్నీ ముందుగానే ఎలిమినేట్ అయి వెళ్లిపోవడం విశేషం. ప్రస్తుతం టాప్ 5లో అభిజిత్, అఖిల్, సొహైల్, హారిక, అరియానా ఉన్నారు. వీరిలో అభి మాత్రమే కాస్తో కూస్తో జనాలకు తెలసు. మిగిలిన వారంతా కొత్త మొహాలే. అయినప్పటికీ టాప్ 5లో స్థానం సంపాదించారు.
ఇదిలా ఉంచితే.. బిగ్‌బాస్‌కు సంబంధించిన లీక్స్‌ను మాత్రం ఎవరూ ఆపలేక పోతున్నారు. ప్రతి వారం హౌస్ నుంచి బయటకు వెళ్లి పోయేదెవరో ముందుగానే తెలిసిపోతోంది. కాగా.. టాప్ 5లో ఉన్న అరియానా, హారిక ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయారు. ఇక మిగిలింది.. అఖిల్, అభిజిత్, సొహైల్ మాత్రమే. ఈ ముగ్గురిలోనే.. విన్నర్, రన్నర్ ఉండబోతున్నారు. అయితే విన్నర్ ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటి నుంచో బయట టాక్ బీభత్సంగా నడుస్తూనే ఉంది.
అభికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ అఫీషియల్ పోల్స్ ప్రకారం చూస్తే అభికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేక పోవడం విశేషం. హౌస్‌లో ఎక్కువగా ఎలిమినేట్ అయిన వ్యక్తి అభియే. అభి ఎలిమినేట్ అయినప్పుడల్లా.. ఆయన ఓటింగ్ రేంజ్‌ను అందుకోవడం ఇతర కంటెస్టెంట్‌లకు అసాధ్యంగానే నడిచింది. ప్రస్తుతం కూడా అంతే. అభి విన్నర్ అని ప్రకటించడం లాంఛనమే. ప్రేక్షకుల ఆసక్తి అంతా రన్నర్ ఎవరనే విషయంపైనే ఉంది. అయితే అఖిల్, సొహైల్‌లలో రన్నర్.. సొహైల్ అనే లీక్ అయితే బయటకు వచ్చింది. అది నిజమా.. కాదా? అని తెలియాలంటే మరికొద్ది సేపు వెయిట్ చేయాల్సిందే.