ఈ బ్లడ్ గ్రూప్ వారికే కరోనా ముప్పు ఎక్కువ..!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు అంతకుమించి సెల్ఫ్ క్వారంటైన్ అనగా స్వీయ నిర్భందం విధించికుని ఇంట్లో నాలుగు గోడలకే పరిమితం అయ్యారు. ఇలా దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో అనుమానాలు సైతం పెనుభూతాలుగా మారాయి. అసలు ఎవరికి ఈ కరోనా వస్తుంది..? ఏ వయస్కులకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది..? ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయ్..? అనే అనుమానాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన వైద్య పరిశోధకులు ఈ విషయంపై పరిశోధన చేసి ఫైనల్‌గా ఫలితం రాబట్టేశారు.
పరిశోధనలో ఏం తేలింది..!?
‘ఏ’ (A) బ్లడ్ గ్రూప్ కలిగినవారికి కరోనా వైరస్ త్వరగా సంక్రమిస్తుందని వైద్యులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇక మిగతా గ్రూపుల విషయానికొస్తే.. ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిపై కాస్త నెమ్మదిగా.. కరోనా వైరస్ ప్రభావాన్ని చూపుతుందని తేల్చారు. గత కొన్నిరోజులుగా చైనా వైద్యులు ఈ అధ్యయనాన్ని ఉహాన్‌లో చేపట్టి ఈ విషయాలను తెలుసుకున్నారు. కరోనా సోకిన 2173 మందిపై పరిశోధనలు జరపగా.. 206 మందిలోని 85 మంది ‘ఏ’ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉండటం గమనార్హం. తరువాతి స్థానంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. అంతేకాదు.. కరోనా సోకి ‘ఏ’ బ్లడ్ గ్రూపు వారే అధికంగా మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.
ఇలా చేయండి!
సో.. ఏ బ్లడ్ గ్రూప్ వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశోధకులు పరోక్షంగా చెబుతున్నారు. సో.. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎంతైనా మంచిది. వైద్యులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పే సూచనలు, సలహాలు, చిట్కాలు పాటించి వీలైనంత వరకూ బయట తిరగకుండా.. మరీ ముఖ్యంగా పొరుగు ఊళ్లకు, రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లే పనులన్నీ వాయిదా వేసుకుంటేనే మంచిదని ఇంటికే పరిమితమైతే చాలా మంచిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com