ఈ యాప్ ఉంటే మీ ఖాతాలో మనీ ఖతమే..

  • IndiaGlitz, [Monday,March 04 2019]

రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకెళ్తుంటే దాన్ని అవసరాలకు కాకుండా కొందరు పనిగట్టుకుని మరీ చిల్లర పనులకోసం వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ యాప్స్ విషయానికొస్తే గంటకొకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్. ఇటీవల యునైటెడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ ఫేస్‌ (యూపీఐ) మాధ్యమంగా ఆన్‌ లైన్‌ చెల్లింపుల సేవలందిస్తున్న ‘ఎనీ డెస్క్‌’ స్మార్ట్ ఫోన్ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే అది పక్కా ఫ్రాడ్ అని.. ఎవరూ ఆ యాప్‌‌ను వాడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. ‘ఎనీ డెస్క్‌’ వల్ల పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాంకులు, యాప్ వాడకందారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా డబ్బు మాయం అవుతోందని.. అందుకే ఈ యాప్‌‌కు దూరంగా ఉంటే మంచిదని ఆర్బీఐ వార్నింగ్ బెల్స్ మోగించింది.

ఎందుకు వాడొద్దంటే..

ఫోన్‌లో ఈ యాప్‌ ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారుల స్మార్ట్‌ ఫోన్లను తమ అధీనంలోకి తీసుకోవడం.. తద్వారా ఆ వినియోగదారుడి ఖాతాల్లోని డబ్బును దుండగులు మాయం చేస్తోందని తేటతెల్లమైందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ సైబర్‌ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఓ ప్రకటనను విడుదల చేస్తూ, మొబైల్‌ వ్యాలెట్‌‌లు, బ్యాంకింగ్‌ యాప్‌‌లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని తెలిపింది. ‘ఎనీ డెస్క్‌’ యాప్‌‌లో లోపాలున్నాయని, వాటిని అలుసుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండవచ్చని అభిప్రాయపడింది.

అయితే.. ఈ యాప్‌‌ను తొలగించాల్సిందిగా గూగుల్‌ ప్లే వంటి యాప్ స్టోర్లకు ఆదేశాలు చేయలేమని.. అందుకే ప్రజల్లో తెలుసుకోవాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మనదేశంలో వీటి సేవలను 2016 ఏప్రిల్‌‌లో ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన 388 కోట్ల లావాదేవీలు జరిగాయని స్పష్టమైంది.

More News

రాజకీయం ఏమీ సినిమా కాదు: పవన్

"రాజ‌కీయం న‌డ‌పాలంటే అనుభ‌వం కావాలి... నేను ఎవ‌రి మీదో ఆధార‌ప‌డి పార్టీ పెట్టలేదు... ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల‌కి ప్రిపేర్ అయ్యాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్  స్పష్టం చేశారు.

ఐటీగ్రిడ్స్‌ స్కాం: కీలక ఆధారాలు దొరికాయ్.. అమెజాన్‌‌కు నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐటీగ్రిడ్స్ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. గత మూడ్రోజులుగా నెలకొన్న ఈ వ్యవహారంపై సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన..

రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తా: పవన్

"నేను ఓ సోష‌ల్ డాక్టర్‌ని రాజ‌కీయ వ్యవ‌స్థకి చికిత్స చేస్తాను. అంద‌రికీ ఉచిత విద్య, వైద్యం జ‌న‌సేన ల‌క్ష్యం.  కుల‌మ‌తాల‌కి అతీతంగా అమ‌లుప‌రుస్తాం" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

5కోట్ల మంది మహిళలు చంద్రబాబుగారి బొమ్మలే!

దివ్యవాణి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. బహుశా సినిమాల్లో ఉన్నప్పుడు ఈమె పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ..

పూర్ణ‌, శ్రావ‌ణిల ప్ర‌యాణ‌మే 'మ‌జిలీ'

నిజ జీవితంలో పెళ్లి చేసుకున్న హీరో నాగ‌చైత‌న్య‌, హీరోయిన్ సమంత పెళ్లి త‌ర్వాత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'మ‌జిలీ'. శివ‌నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి