ఈ యాప్ ఉంటే మీ ఖాతాలో మనీ ఖతమే..
Send us your feedback to audioarticles@vaarta.com
రోజురోజుకు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకెళ్తుంటే దాన్ని అవసరాలకు కాకుండా కొందరు పనిగట్టుకుని మరీ చిల్లర పనులకోసం వాడుతున్నారు. ముఖ్యంగా స్మార్ట్ యాప్స్ విషయానికొస్తే గంటకొకటి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయ్. ఇటీవల యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) మాధ్యమంగా ఆన్ లైన్ చెల్లింపుల సేవలందిస్తున్న ‘ఎనీ డెస్క్’ స్మార్ట్ ఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. అయితే అది పక్కా ఫ్రాడ్ అని.. ఎవరూ ఆ యాప్‌ను వాడొద్దని ఆర్బీఐ హెచ్చరించింది. ‘ఎనీ డెస్క్’ వల్ల పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయంటూ బ్యాంకులు, యాప్ వాడకందారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్బీఐ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ యాప్ ద్వారా డబ్బు మాయం అవుతోందని.. అందుకే ఈ యాప్‌కు దూరంగా ఉంటే మంచిదని ఆర్బీఐ వార్నింగ్ బెల్స్ మోగించింది.
ఎందుకు వాడొద్దంటే..
ఫోన్లో ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారుల స్మార్ట్ ఫోన్లను తమ అధీనంలోకి తీసుకోవడం.. తద్వారా ఆ వినియోగదారుడి ఖాతాల్లోని డబ్బును దుండగులు మాయం చేస్తోందని తేటతెల్లమైందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ సైబర్ భద్రత, ఐటీ పరిశోధన విభాగం ఓ ప్రకటనను విడుదల చేస్తూ, మొబైల్ వ్యాలెట్లు, బ్యాంకింగ్ యాప్‌లలోనూ అవకతవకలు జరుగుతున్నాయని తెలిపింది. ‘ఎనీ డెస్క్’ యాప్‌లో లోపాలున్నాయని, వాటిని అలుసుగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతుండవచ్చని అభిప్రాయపడింది.
అయితే.. ఈ యాప్‌ను తొలగించాల్సిందిగా గూగుల్ ప్లే వంటి యాప్ స్టోర్లకు ఆదేశాలు చేయలేమని.. అందుకే ప్రజల్లో తెలుసుకోవాలని ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. కాగా.. మనదేశంలో వీటి సేవలను 2016 ఏప్రిల్‌లో ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.6.4 లక్షల కోట్ల విలువైన 388 కోట్ల లావాదేవీలు జరిగాయని స్పష్టమైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout