ఆ దర్శకుడితో మూడోసారి
- IndiaGlitz, [Friday,July 08 2016]
గోపీచంద్ హీరోగా మాస్ మహారాజా రవితేజను 'బెంగాల్ టైగర్' తర్వాత సంపత్ నంది దర్శత్వంలో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.
ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న ఆక్సిజన్ పూర్తి కావచ్చింది. ఈ సినిమాను త్వరలోనే సెట్స్‌లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈచిత్రంలో మిల్కీబ్యూటీ తమన్నా ఓ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. మరో హీరోయిన్‌గా రాశిఖన్నాను సంప్రదిస్తున్నారు. మరి మూడో హీరోయిన్ ఎవరో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాగా సంపత్‌నంది దర్శకత్వంలో రచ్చ, బెంగాల్‌టైగర్ చిత్రాలు తర్వాత తమన్నా చేయబోతున్న మూడో చిత్రమిది కావడం విశేషం.