ముచ్చటగా మూడు సినిమాలతో..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ పూజా హెగ్డే. ఆ తరువాత ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ చిత్రాల్లో సందడి చేసింది. ముఖ్యంగా దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో తన డ్యాన్స్‌లతో యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఇదిలా ఉంటే.. ఈ సంవత్సరం ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేయనుంది పూజా. కాస్త వివరాల్లోకి వెళితే.. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ రూపొందిస్తున్న రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే ఓ ప్రత్యేక గీతం చేసింది.
ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆమె కలిసి నటిస్తున్న సాక్ష్యం కూడా వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో ఆమె కనిపించనుందని తెలిసింది. ఈ రెండు చిత్రాలతో పాటు మహేష్ బాబు 25వ చిత్రంలోనూ పూజా కథానాయికగా ఎంపికైంది. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్ళే ఈ సినిమా.. దీపావళికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. మొత్తమ్మీద.. ముచ్చటగా మూడు చిత్రాలతో డీజే బ్యూటీ తెలుగు తెరపై సందడి చేయనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com