రవితేజ మూడో హీరోయిన్ దొరికేసింది
Send us your feedback to audioarticles@vaarta.com
`అమర్ అక్బర్ ఆంటోని` సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్. ఇప్పటికే నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా లేటెస్ట్గా మూడో హీరోయిన్ ఓకే అయ్యిందట. సమాచారం ప్రకారం `పటేల్‌సార్`, `అప్పట్లో ఒకడుండేవాడు` ఫేమ్ తాన్యా హోప్ `డిస్కోరాజా`లో మూడో హీరోయిన్గా నటించనున్నారు. ఈమె ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్రను పోషిస్తున్నారట. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న తాన్యాకు రవితేజ `డిస్కోరాజా` ఏ మేర సాయపడతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments