మార్చి-3న నిర్భయ దోషులకు ఉరి..

  • IndiaGlitz, [Monday,February 17 2020]

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీం, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో కాస్త లేట్ అయ్యింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు గౌరవం లేదా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా.. కొత్త డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 3న ఉదయం 6 గంటలకే ఆ నలుగురు దోషులు ముకేశ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు సోమవారం నాడు మరోసారి వెల్లడించింది. కాగా.. ఈ కామాంధులకు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. దోషులకు ఉరి శిక్ష ఖరారైనప్పటికీ న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున గతంలో జారీ అయిన రెండు డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించడం జరిగింది. ఈ క్రమంలో పాటియాలా కోర్టు తాజాగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.

ఇదీ గతం..!

ఢిల్లీలోని పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారమైన విషయం విదితమే. 2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
 

More News

మ‌రో రీమేక్ సినిమా హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న చ‌ర‌ణ్‌

ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ రామ్‌చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘సోది ఆపి.. దమ్ముంటే నన్ను ఆపు’ (‘V’ టీజర్ రివ్యూ)

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘V’ చిత్రం. ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన చిత్రబృందం తాజాగా టీజర్‌ను వదలింది.

రామానాయుడుస్టూడియో క‌నుమ‌రుగ‌వనుందా?

మూవీ మొఘ‌ల్‌.. డా.డి.రామానాయుడు, తెలుగు చిత్ర‌సీమ మ‌ర‌చిపోలేని పేరు. శ‌తాధిక చిత్ర నిర్మాతే కాదు.

ఫిబ్రవరి 28న ధనుష్ 'లోకల్ బాయ్'

కథానాయకుడిగా ధనుష్‌ది విలక్షణ శైలి. 'రఘువరన్ బీటెక్'లో సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పేరు తెచ్చిపెట్టడానికి పెద్ద సినిమానే అవసరం లేదు: మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర

ఇప్పుడున్న టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో శేఖర్ చంద్రకు ఓ ప్రత్యేకత ఉంది. చాలా మంది ప్లే లిస్ట్స్ లో ఈయన సంగీతం అందించిన పాటలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.