మార్చి-3న నిర్భయ దోషులకు ఉరి..
Send us your feedback to audioarticles@vaarta.com
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అతి భయంకరమైన నిర్భయ కేసులో ఎట్టకేలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష ఖరారైపోయింది. ఇప్పటికే డెత్ వారెంట్లు జారీ అవ్వగా.. దోషులు సుప్రీం, రాష్ట్రపతిని ఆశ్రయిండంతో కాస్త లేట్ అయ్యింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు గౌరవం లేదా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా.. కొత్త డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. మార్చి 3న ఉదయం 6 గంటలకే ఆ నలుగురు దోషులు ముకేశ్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌ను ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు సోమవారం నాడు మరోసారి వెల్లడించింది. కాగా.. ఈ కామాంధులకు డెత్ వారెంట్లు జారీ చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. దోషులకు ఉరి శిక్ష ఖరారైనప్పటికీ న్యాయపరమైన అవకాశాలు పెండింగ్‌లో ఉన్నందున గతంలో జారీ అయిన రెండు డెత్ వారెంట్లపై కోర్టు స్టే విధించడం జరిగింది. ఈ క్రమంలో పాటియాలా కోర్టు తాజాగా కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది.
ఇదీ గతం..!
ఢిల్లీలోని పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దక్షిణ ఢిల్లీలో ప్రాంతంలో ముకేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్‌కుమార్ సింగ్ (31) అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారమైన విషయం విదితమే. 2012 డిసెంబర్ 16న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన అప్పట్లో కలకలం రేపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com