'తిక్క' లెటెస్ట్ అప్ డేట్స్.....
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్ హీరోగా వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్‌పై సునీల్ రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్‌కుమార్‌రెడ్డి నిర్మించిన చిత్రం `తిక్క`. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా థమన్ మ్యూజిక్ అందించిన సినిమా ఆడియో కూడా విడుదలైంది. ఆగస్ట్ 13న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ ఫిలింస్ వారు దక్కించుకున్నారు. అలాగే ఓవర్ సీస్‌లో ఈ సినిమాను ఐడ్రీమ్ మీడియా వారు విడుదల చేస్తున్నారు. వరుస విజయాలపై ఉన్న సాయిధరమ్ తన తిక్కను ఎలా చూపించి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరోయిన్స్ నటించిన ఈ చిత్రంపై డైరెక్టర్ సునీల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఓం తర్వాత ఈ దర్శకుడు చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments