Tamil »
Cinema News »
చిరంజీవి గారి బాటలో మేమందరం పయనిస్తున్నాం...అభిమానుల ప్రేమకు మేమంతా బానిసలం -సాయిధరమ్ తేజ్
చిరంజీవి గారి బాటలో మేమందరం పయనిస్తున్నాం...అభిమానుల ప్రేమకు మేమంతా బానిసలం -సాయిధరమ్ తేజ్
Sunday, July 31, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్, మన్నార చోప్రా, లెరిస్సా బొనేసి హీరో, హీరోయిన్స్ గా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ తిక్క. ఈ చిత్రాన్ని ఓమ్ ఫేమ్ సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా సి.ఆర్.రోహిన్ కుమార్ రెడ్డి ఈ మూవీని నిర్మించారు. ఎస్. ఎస్. తమన్ మ్యూజిక్ అందించిన తిక్క ఆడియో రిలీజ్ కార్యక్రమం సినీ,రాజకీయ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా రిలీజైంది. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి ముఖ్య అతిధిగా హాజరై తిక్క ఆడియోను ఆవిష్కరించగా...ప్రముఖ రాజకీయ నాయకుడు జానారెడ్డి తిక్క థియేట్రికల్ ట్రైలర్ ను లాంఛ్ చేసారు.
ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ.... నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి తొలి ప్రయత్నంగా మా మెగాఫ్యామిలీ హీరోతో ఈ సినిమా చేయడం అదృష్టం. టీజర్ చూస్తుంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అనిపిస్తుంది.తిక్క టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
డైరెక్టర్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...తేజు పేరు చెబుతుంటేనే గుండెల్లో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అతను మై హీరో. వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. తేజు ఇంకా 146 మెట్లు ఎక్కాలి. ఖచ్చితంగా మీ అందరి అంచనాలకు తగ్గట్టు తేజు పెద్ద స్ధాయికి వెళతాడు అన్నారు.
కోన వెంకట్ మాట్లాడుతూ... తేజు మావయ్య పవర్ స్టార్ తిక్క ఏమిటో చూసాం. తేజు తిక్క ఏమిటో చూడాలి. చిరంజీవి గారి పోలికలు.. పవన్ కళ్యాణ్ ఆశీస్సులు.. అటు మెగా పవర్ స్టార్ తో పాటు మొత్తం ఫ్యామిలీ ఆదరణ అలాగే అభిమానులు ఆదరణ అంతా కలిసి తిక్క బ్లాక్ బష్టర్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ సునీల్ కు తిక్క మూవీ బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ...పవర్ స్టార్ ఎక్కడ ఉన్నా తేజుకి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. సినిమా సినిమాకి జనాల మనసులు దోచుకుంటూ దూసుకెళుతున్నాడు తేజు. సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన తేజు తిక్క ఏమిటో చూపించి సూపర్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. సినిమాల నుంచి రాజకీయాలకు వెళుతుంటారు. కానీ..రాజకీయాల నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన రోహిన్ కుమార్ రెడ్డి సక్సెస్ సాధించాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు తిక్క టీమ్ అని తెలియచేసారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ... సునీల్ పెంటాస్టిక్ కెమెరామెన్. సునీల్ తిక్క ఏమిటంటే అందరూ వెళ్లే దారిలో కూడా డిఫరెంట్ రూట్ లో వెళతాడు. ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ. తిక్క ట్రైలర్ చూస్తుంటే బ్లాక్ బష్టర్ కళలు కనిపిస్తున్నాయి. సాయిధరమ్ తేజ్ డిఫరెంట్ కథలు ఎంచుకుంటున్నాడు. తమన్ ఒక సముద్రం లాంటి వాడు. ఈ మూవీకి డిఫరెంట్ మ్యూజిక్ అందించాడు అన్నారు.
బి.వి.ఎస్ రవి మాట్లాడుతూ... హీరో సాయిధరమ్ తేజ్ నటుడు కాక ముందు నుంచి నాకు మంచి స్నేహితుడు. చిరంజీవి గారి క్రమశిక్షణ, పవన్ కళ్యాణ్ గారి నిజాయితి పుణికిపుచ్చుకున్న నటుడు తేజు. ప్రతి అడుగులో క్లారిటీ ఉంటుంది. పైస్ధాయికి వెళ్లే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సాంకేతిక రంగా మంచి పట్టు ఉన్నడైరెక్టర్ సునీల్ ఈ సినిమా తో సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. తమన్ ఏం చేసిన సంచలనమే. ఈసినిమాకి బ్లాక్ బష్టర్ సాంగ్స్ ఇచ్చాడు. పాటలతో పాటు రి రీకార్డింగ్ కూడా బాగా ఇచ్చుంటాడని ఆశిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ... ఈ సినిమా హీరో తేజు, డైరెక్టర్ సునీల్ రెడ్డి, నిర్మాత రోహిన్ కుమార్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్..వీళ్లందరూ నాకు బాగా తెలిసినవాళ్లు. సో...ఈ సినిమా నా సినిమాగా ఫీలవుతున్నాను. తేజు భయంతో కెరీర్ ప్రారంభించాడు. సక్సెస్ లో ఉన్నా భయంగానే ఉన్నాడు. తేజు నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే నువ్వు చేరాల్సింది చాలా ఉంది. తేజు తో సినిమా చేయడానికి నేను ఎప్పుడైనా సిద్దమే.
ఇక డైరెక్టర్ సునీల్ గురించి చెప్పాలంటే...మంచి మనసున్న వ్యక్తి. మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు అండగా నిలిచాడు. ఫస్ట్ సినిమాతో సక్సెస్ సాధించకపోయినా తర్వాత సినిమాతో సక్సెస్ సాధించిన వాళ్లు చాలా మందిలో ఉన్నారు. అందులో నేను ఒకడిని. అలాగే సునీల్ కూడా సక్సెస్ సాధిస్తాడు అని నా నమ్మకం. రాజకీయాల్లో సక్సెస్ సాధించిన రోహిన్ సినిమా రంగంలో కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. తమన్ గురించి ఏదేదో వింటుంటాం కానీ...తమన్ టాలెంట్ ఏమిటో నాకు తెలుసు. తమన్ ఎంత గొప్ప మ్యూజిక్ అందించగలడో భవిష్యత్ లో అందరికీ తెలుస్తుంది అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఈ మూవీ కథ నాకు రైటర్ దావుద్ చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ ఉంటుంది.ఇది బ్రేక్ అప్ స్టోరీ కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇక డైరెక్టర్ సునీల్ గురించి చెప్పాలంటే...నాకు ఎప్పటి నుంచో పరిచయం.ఆయనకు టెక్నికల్ గా అన్ని విషయాల పై మంచి పట్టు ఉంది. నిర్మాత రోహిన్ ఈ చిత్రాన్ని హై స్టాండర్ట్స్ తో ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. తమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. రాజేంద్రప్రసాద్, రఘబాబు, వెన్నెలకిషోర్, ఆలీ వీళ్లందరితో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్.
చిరంజీవి గారు, కళ్యాణ్ గారి ఆశీస్సులు ఉండడం వలనే నేను ఇక్కడ ఉన్నాను. వాళ్లు లేకపోతే నేను లేను. చిరంజీవి గారు 30 సంవత్సరాలు కష్టపడి మీ అందరి ప్రేమను పొందారు. పవన్ కళ్యాణ్ గారు కూడా తన స్టైల్ లో కష్టపడి మీ అందరి ఆదరణ పొందారు. ఇప్పుడు బన్ని, చరణ్, వరుణ్, నేను మేమందరం అదే బాటలో కష్టపడుతున్నాం. మీ ప్రేమకు బానిసలం. మీకోసం ఎంత చేసినా తక్కువే. మీకోసం ఎప్పుడూ ఏదో చేయాలి అనిపిస్తుంది. అభిమానంలో పీక్స్ అంటే మెగా అభిమానులే చూపిస్తారు అన్నారు.
ఈ కార్యక్రమంలో రామజోగయ్య శాస్త్రి, రఘుబాబు, ముమైత్ ఖాన్, ప్రభాస్ శీను, రాజకీయ నాయకులు జానారెడ్డి, మాగంటి గోపీనాధ్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments