ఆల్ ఆడియన్స్ ని ఆకట్టుకునే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తిక్క- నిర్మాత డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, మన్నార చోప్రా హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం తిక్క ఈ చిత్రాన్ని సునీల్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర మూవీ బ్యానర్ పై డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి నిర్మించారు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న తిక్క ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా తిక్క ప్రొడ్యూసర్ డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి తో ఇంటర్ వ్యూ మీకోసం...
నిర్మాతగా తొలి చిత్రం కదా...ముందు మీ గురించి చెప్పండి..?
నేను మెడిసిన్ చదివి డెంటిస్ట్ గా వర్క్ చేసాను. ఆతర్వాత బిజినెస్ కూడా చేసాను. అయితే పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ తో 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. డైరెక్టర్ సునీల్ తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఓరోజు రైటర్ దావూద్ ని తీసుకువచ్చి ఈ కథ చెప్పాడు. కథ నచ్చింది. హీరో తేజు తో కూడా నాకు పరిచయం ఉంది. తేజుకి ఈ కథ చెబితే వెంటనే ఓకే అన్నాడు. దీంతో తేజు - సునీల్ రెడ్డి కాంబినేషన్లో ఈ మూవీ స్టార్ట్ చేసాం.
తిక్క కథ ఏమిటి..?
ఇది యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. దీనిలో మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అది కొత్తగా ఉంటుంది. ప్రజెంట్ యూత్ ఏం కోరుకుంటున్నారో...అవన్నీ ఉండే కమర్షియల్ సినిమా తిక్క.
తొలిప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రాన్ని ఫ్లాప్ డైరెక్టర్ తో చేయడం రిస్క్ అనిపించలేదా..?
సునీల్ రెడ్డి తీసిన ఓమ్ సినిమా రిజెల్ట్ గురించి నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అయితే....ఆ సినిమా కథ ఎలా ఉన్నా..టేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ కథను తేజు విని చాలా బాగుంది చేస్తాను అన్నాడు. అలాగే ఇండస్ట్రీలో నాకు తెలిసిన కొంత మంది పెద్దలకు ఈ కథ వినిపించాను. వాళ్లు కూడా కథ విని బాగుంది. ఎలాంటి సందేహం అవసరం లేదు. మీరు ఈ కథతో సినిమా తీయచ్చు అని ప్రొత్సహించారు. ఇటీవల తేజు సెలెక్ట్ చేసుకుంటున్న కథలు ఎలా ఉన్నాయో...ఎలాంటి సక్సెస్ సాధిస్తున్నాడో చూసాం. సో...తేజు జడ్జెమెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుచేత సునీల్ రెడ్డితో సినిమా చేయడం రిస్క్ అని అనిపించలేదు.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి, మన్నార చోప్రా నటించారు కదా...ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవచ్చా..?
ఇది ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కాదు...ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఎక్కడా బోర్ అనేది లేకుండా సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రస్టింగ్ గా చూసేలా ఉంటుంది.
తిక్క హైలైట్స్ ఏమిటి..?
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలకు డైలాగ్స్ రాసిన హర్షవర్ధన్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాసారు.ఈ డైలాగ్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి. ముమైత్ ఖాన్, ఆలీ, సప్తగిరి తదితరులపై చిత్రీకరించిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. తమన్ ఎక్స్ టార్డ్రినరీ మ్యూజిక్ అందించాడు. ఇక ఫైట్స్ విషయానికి వస్తే...ఓ ఫైట్ ను జాకీచాన్ చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసే విలియమ్ వాంగ్ తో చేయించాం. అలాగే రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో రెండు ఫైట్స్ , రవివర్మ నేతృత్వంలో ఓ ఫైట్ చేసాం. మొత్తానికి సాంగ్స్, ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి.
తిక్క ప్రొగ్రెస్ ఏమిటి..?
ఒక సాంగ్ షూట్ చేయాలి. ఈ సాంగ్ ను లడక్ లో చిత్రీకరించనున్నాం. ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుగుతుంది. ఈ నెలాఖరుకు ఆడియో రిలీజ్ చేసి చిత్రాన్ని ఆగష్టులో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
నవీన్ తో చేస్తున్న మూవీ గురించి..?
నవీన్ హీరోగా శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాం. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం.
బాలీవుడ్ లో మూవీ ప్లాన్ చేస్తున్నారు కదా..?
అవును...నాకు ఎప్పటి నుంచో హిందీ సినిమా చేయాలని కోరిక. ఒక స్ర్కిప్ట్ రెడీగా ఉంది. ఆ చిత్రాన్ని హిందీ, తెలుగులో ప్లాన్ చేస్తున్నాం. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తాను.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout