అక్టోబర్ లో ఒక్కటి కానున్నారు...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని నాగచైతన్య, సమంతలు ఇప్పటి వరకు లవర్స్గానే కొనసాగుతున్నారు. ఇద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిశ్చితార్థం జరిపించేసిన సంగతి తెలిసిందే. అయితే పెళ్ళి విషయంలో క్లారిటీ రాలేదు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఇద్దరూ అక్టోబర్లో ఓ ఇంటివారు కాబోతున్నారట.
ఈలోపు వీరిద్దరూ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేయాలనే ఆలోచనతో నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో సహా కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీని పూర్తి చేసేస్తున్నాడు. సమంత కూడా నాగార్జునతో కలిసి `రాజుగారి గది2` సినిమాను పూర్తి చేసే పనిలో ఉంది. కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత ఇద్దరూ పెళ్ళి పీటలెక్కుతారేమో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments