అక్టోబర్ లో ఒక్కటి కానున్నారు...

  • IndiaGlitz, [Wednesday,April 19 2017]

అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు ఇప్ప‌టి వ‌ర‌కు ల‌వ‌ర్స్‌గానే కొన‌సాగుతున్నారు. ఇద్ద‌రి పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి నిశ్చితార్థం జ‌రిపించేసిన సంగ‌తి తెలిసిందే. అయితే పెళ్ళి విష‌యంలో క్లారిటీ రాలేదు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఇద్ద‌రూ అక్టోబ‌ర్‌లో ఓ ఇంటివారు కాబోతున్నార‌ట‌.

ఈలోపు వీరిద్ద‌రూ ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేసేయాల‌నే ఆలోచ‌న‌తో నాగ‌చైత‌న్య రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో స‌హా కొత్త ద‌ర్శ‌కుడు కృష్ణ దర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్ మూవీని పూర్తి చేసేస్తున్నాడు. స‌మంత కూడా నాగార్జున‌తో క‌లిసి 'రాజుగారి గ‌ది2' సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉంది. క‌మిట్ మెంట్స్ పూర్త‌యిన త‌ర్వాత ఇద్ద‌రూ పెళ్ళి పీట‌లెక్కుతారేమో..