Sharmila:విదేశాలకు పారిపోతారు.. సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు విదేశాలకు పారిపోయేందుకు రెడీగా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి ఇదే భారతిరెడ్డి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు.
గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని సలహా ఇచ్చారు. అలాగే ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పాస్‌పోర్టులు కూడా రెడీ చేసుకున్నారని అన్నారు. ఓడిపోయిన తర్వాత నడుస్తున్న కేసుల్లో అరెస్టు తప్పదని వాళ్లందరికి తెలుసు అని పేర్కొన్నారు. అందుకే అరెస్టుల నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.
ఇక ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా షర్మిల ఆయనకు రేడియో గిఫ్ట్‌గా పంపించారు. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి అంటూ ఆమె రేడియోను పంపారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని.. ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వివరిస్తూ పది అభియోగాలు ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో ఏపీ అన్ని విధాలుగా నాశనమైందని విమర్శించారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
"ఇది మోడీ గారి మన్‌కీ బాత్. మీకు ఇలా చెబితే అర్థం అవుతుందేమో. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి. మోడీ గారు మీరు గత పది సంవత్సరాలు ఏపీని మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పదేళ్లకు పది అభియోగాలతో ఛార్జ్ షీట్ పంపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్‌కీ బాత్ అర్థం చేసుకున్నాక ఆ చార్జ్‌షీట్ ప్రకారం లిఖితపూర్వకంగా క్షమాపణ లేఖ రాసి.. ఏపీ ప్రజల హక్కులు కాపాడతారని రిటర్న్ అఫిడవిట్ రాసిన తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది"అని షర్మిల తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments