Sharmila:విదేశాలకు పారిపోతారు.. సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,May 08 2024]

సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతిరెడ్డిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతున్నామనే భయంతో ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు విదేశాలకు పారిపోయేందుకు రెడీగా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ గొడలితో నరికేయాలి. వాళ్లే సింగిల్ ప్లేయర్‌గా ఉండాలి ఇదే భారతిరెడ్డి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు.

గొడ్డలితో అందర్నీ నరికేస్తే ఎవరూ పోటీ చేయరని అప్పడు సింగిల్ ప్లేయర్‌గా ఉండొచ్చని సలహా ఇచ్చారు. అలాగే ఓడిపోయిన తర్వాత విదేశాలకు పారిపోవడానికి అవినాష్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పాస్‌పోర్టులు కూడా రెడీ చేసుకున్నారని అన్నారు. ఓడిపోయిన తర్వాత నడుస్తున్న కేసుల్లో అరెస్టు తప్పదని వాళ్లందరికి తెలుసు అని పేర్కొన్నారు. అందుకే అరెస్టుల నుంచి తప్పించుకోవాలనే ఆలోచనతో విదేశాలకు పారిపోయేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.

ఇక ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా షర్మిల ఆయనకు రేడియో గిఫ్ట్‌గా పంపించారు. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి అంటూ ఆమె రేడియోను పంపారు. మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హత లేదని.. ముందు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని వివరిస్తూ పది అభియోగాలు ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మోదీ పాలనలో ఏపీ అన్ని విధాలుగా నాశనమైందని విమర్శించారు. నాడు చంద్రబాబు, నేడు జగన్ కేంద్రంలోని బీజేపీకి అంటకాగుతూ విభజన హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.

ఇది మోడీ గారి మన్‌కీ బాత్‌. మీకు ఇలా చెబితే అర్థం అవుతుందేమో. ఏపీ ప్రజల మన్ కి బాత్ మీరు వినండి. మోడీ గారు మీరు గత పది సంవత్సరాలు ఏపీని మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పదేళ్లకు పది అభియోగాలతో ఛార్జ్ షీట్ పంపిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్‌కీ బాత్ అర్థం చేసుకున్నాక ఆ చార్జ్‌షీట్ ప్రకారం లిఖితపూర్వకంగా క్షమాపణ లేఖ రాసి.. ఏపీ ప్రజల హక్కులు కాపాడతారని రిటర్న్ అఫిడవిట్ రాసిన తర్వాత రాష్ట్రంలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందిఅని షర్మిల తెలిపారు.

More News

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ గెలుపు కోసం రంగంలోకి హీరోలు

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌ పిఠాపునం నియోజకవర్గం వైపే అందరి చూపు ఉంది.

Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీకి ఈసీ బ్రేక్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రైతు భరోసా(Rythu Bharosa) నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది.

Mahasena Rajesh:పవన్ కంటే జగన్ బెటర్.. మహాసేన రాజేష్ యూటర్న్..

ఏపీలో ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా టీడీపీ నేత మహానేత రాజేష్

Ambati Rambabu son-in-law:మరో వీడియో వదిలిన మంత్రి అంబటి రాంబాబు అల్లుడు

ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu), ఆయన చిన్నల్లుడు గౌతమ్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

Committee Kurrollu:జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా  ‘కమిటీ కుర్రోళ్ళు’ నుంచి ‘గొర్రెలా..’ అనే పాట విడుదల

ఎన్నికల సమయం దగ్గర పడుతుంది.. రాజకీయ పార్టీలు ప్రజలను ప్రలోభ పెట్టటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషిస్తున్నాయి.