వాళ్లిద్దరూ చేయమన్నారు..?
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళనాట శశికళ జైలులో అనుభవిస్తున్న రాజభోగాలను బయటపెట్టిన డీజీపీ రూప సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి విదితమే. ఈమె స్ఫూర్తితో దర్శకుడు ఏఎంఆర్ రమేష్ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కథను కూడా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా డీజీపీ రూప పాత్రలో నటించమని నయనతార, అనుష్కలను సంప్రదించాడట దర్శకుడు రమేష్. సదరు దర్శకుడు.
అయితే వీరిద్దరూ ఈ కథలో రాజకీయ కోణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తాము నటించలేమని తేల్చేశారిద్దరూ. శశికళకు సంబంధించిన కాన్సెప్ట్ కావడంతో బెదిరిపులు వస్తాయని ఇద్దరూ వెనుకంజ వేస్తారని సమాచారం. కాగా ఇప్పుడు దర్శకుడు రమేష్ హీరోయిన్ త్రిషను సంప్రదించే పనిలో బిజీగా ఉన్నారు. మరి త్రిష ఏమని అంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com