నా నలుగురు కెప్టెన్స్ వీళ్లే: చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి మంచి స్పీడు మీదున్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు మెగాస్టార్. ఈ సినిమా ఫైనల్ స్టేజ్‌లో ఉండగానే మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్‌ను ట్రాక్ ఎక్కించేస్తున్నాడు. ఫిబ్రవరి నుండి లూసిఫర్ సినిమా మొదలు కానుంది. దీనికి మోహన్‌రాజా దర్శకుడు. ఇది పూర్తి అయ్యే సమయానికి తమిళ చిత్రం వేదాళం రీమేక్ స్టార్ట్ అవుతుంది. దీనికి మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బాబీతో చిరంజీవి సినిమా చేయబోతున్నారు ఈ విషయాన్ని చిరంజీవి మరోసారి ఓ ఫొటోతో ధృవీకరించారు. కొరటాల శివ, మోహన్‌రాజా, మెహర్ రమేశ్, బాబీలో కలిసి ఉన్న ఫొటోను తన ట్విట్టర్లో షేర్ చేసిన చిరంజీవి.. ‘నా నలుగురు కెప్టెన్స్ వీళ్లే.. ఫెంటాస్టిక్ 4 చార్ కదమ్’ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. కోకాపేటలో వేసిన భారీ సెట్లో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్ సిద్ధ అనే నక్సలైట్ నాయకుడు పాత్రలో కనిపించనుండగా, చిరంజీవి.. మాజీ నక్సలైట్‌గా, దేవాదాయ శాఖలోని అవినీతిని ప్రశ్నించే వ్యక్తిగా కనిపించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com