మరోసారి కలసి నటిస్తున్నారు....

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

నారారోహిత్‌, నాగ‌శౌర్య‌లు క‌లిసి ఈ ఏడాది శ్రీని అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో 'జ్యోఅచ్యుతానంద' సినిమాలో యాక్ట్ చేశారు. అన్న‌ద‌మ్ములుగా నారారోహిత్‌, నాగ‌శౌర్య‌ల న‌ట‌న అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌ల‌సి న‌టించ‌బోతున్నారు. నారారోహిత్ హీరోగా మ‌హేష్ సూర‌ప‌నేని ద‌ర్శ‌క‌త్వంలో 'క‌థ‌లో రాజకుమారి' అనే సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నాగ‌శౌర్య పేరును రెఫ‌ర్ చేశాడ‌ట‌. న‌మిత ప్ర‌మోద్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని వెంక‌ట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ప్ర‌స్తుతం సినిమా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. నారారోహిత్ ఫోన్ చేయ‌గానే రోల్ ఏంట‌నే విష‌యం కూడా అడ‌గకుండా నాగ‌శౌర్య సినిమాలో యాక్ట్ చేయ‌డానికి ఒప్పుకున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.