మరోసారి కలసి నటిస్తున్నారు....
Send us your feedback to audioarticles@vaarta.com
నారారోహిత్, నాగశౌర్యలు కలిసి ఈ ఏడాది శ్రీని అవసరాల దర్శకత్వంలో `జ్యోఅచ్యుతానంద` సినిమాలో యాక్ట్ చేశారు. అన్నదమ్ములుగా నారారోహిత్, నాగశౌర్యల నటన అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. నారారోహిత్ హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో `కథలో రాజకుమారి` అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం నాగశౌర్య పేరును రెఫర్ చేశాడట. నమిత ప్రమోద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. నారారోహిత్ ఫోన్ చేయగానే రోల్ ఏంటనే విషయం కూడా అడగకుండా నాగశౌర్య సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వినపడుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com