22 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు..!
Send us your feedback to audioarticles@vaarta.com
శంకర్ దర్శకత్వంలో 22 ఏళ్ల క్రితం అంటే 1998లో రూపొందిన చిత్రం ‘జీన్స్’. ఈ సినిమాలో ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. మేకింగ్‌లో శంకర్‌లోని మరో కోణంలో ఆవిష్కరించిన చిత్రమిది. ఈ సినిమాతో ప్రశాంత్‌కు మంచి ఇమేజే వచ్చింది. తర్వాత ఐశ్వర్యరాయ్ బాలీవుడ్లో బిజీ బిజీ అయ్యింది. బాలీవుడ్లో ఐశ్వర్య స్టార్ హీరోయిన్ అయిన తర్వాత దక్షిణాదిన ఆమె చేసిన సినిమాలే తక్కువ. చాలా కాలం తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఇప్పుడు మరో తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఆ తమిళ చిత్రాన్ని బాలీవుడ్ నుండే రీమేక్ చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్’ చిత్రాన్ని తమిళంలో, తెలుగులో వేర్వేరు దర్శక నిర్మాతలు, నటీనటులతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో నితిన్ హీరోగా నటిస్తుంటే, తమిళంలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్లో టబు పోషించిన రోల్‌ను తెలుగులో తమన్నా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తమిళంలో ఐశ్వర్యరాయ్ చేస్తున్నారట. అంటే 22 ఏళ్ల తర్వాత ప్రశాంత్, ఐశ్వర్యరాయ్ కలిసి నటిస్తోన్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout