ఈ మొక్కలు ఇంట్లో ఉన్నాయంటే.. ఆక్సిజన్‌కు కొదవుండదు..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఎంత అవసరమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున జనం కరోనా బారిన పడుతున్నారు. వీరిలో పరిస్థితి విషమిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ఆక్సిజన్ అవసరమనేది బాగా పెరిగింది. ఆక్సిజన్ కొరత కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో ఆక్సిజన్‌ను పెంపొందించుకునే అవకాశాల కోసం ప్రజలు యత్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనకు ఆక్సిజన్‌ను అందించేవి చెట్లు. ప్రస్తుత తరుణంలో చెట్లు పెంచేంత స్థలమైతే ఎక్కడా పెద్దగా ఉండట్లేదు. ఈ క్రమంలోనే ఇండోర్ ప్లాంట్లనైనా పెంచి వాటి ద్వారా ఆక్సిజన్‌ను పెంపొందించుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్లతో ఇంటిలోపల స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ తగినంతగా సరఫరా అవుతున్నాయనడంలో సందేహం లేదు. మనకు ఆక్సిజన్ అందించడంలో ఏ ఏ మొక్కలు ది బెస్ట్ అనేది చూద్దాం.
ఫైకస్ ప్లాంట్..
ఫైకస్ ప్లాంట్, సాధారణంగా దీనిని వీపింగ్ ఫిగ్ అని పిలుస్తారు. ఈ మొక్క అందంగా ఉండటమే కాదు.. గాలిని సైతం చక్కగా శుద్ధి చేసి మనకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఎన్నో ప్రయోజనాలతో కూడిన సాధారణ హౌజ్ ప్లాంట్. ఇది గాలిని శుద్ధి చేసే ప్లాంట్లలో ఒకటిగా నాసా గుర్తించడం విశేషం. ఫార్మాల్డిహైడ్, జిలీన్, టోలుయెన్లను శుభ్రపరచడంలో ఈ మొక్క సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు నాసా గుర్తించింది. ఈ మొక్కను మన ఇంట్లో ఉంచడం ద్వారా ఇంటి లోపల పీల్చే గాలి నాణ్యతను మెరుగుపరచుకుని తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
కలబంద..
ఇక కలబంద మన చర్మానికే కాదు.. ఇతర ప్రయోజనాలనూ అందిస్తుంది. ఇది అనేక వైద్య ప్రయోజనాలను కలిగిన మొక్క. దీని వలన ఎన్నో ఉపయోగాలున్నాయి కాబట్టే దీనిని ‘వండర్ ప్లాంట్’ అని కూడా పిలుస్తారు. ఇది గాలిని శుద్ధి చేయడానికి ఒక అద్భుతమైన మొక్క. ఇది గాలి నుంచి బెంజీన్, ఫార్మాల్డిహైడ్లను తొలగిస్తుంది. ఇది రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేయడంలో కూడా దిట్ట కావడం విశేషం. ఇది ఆక్సిజన్ అందించే ఒక అద్భుతమైన ఇండోర్ ప్లాంట్.
పోతాస్..
ఆక్సిజన్ అందించే మరో అందమైన మొక్క పోతాస్. ఈ మొక్క ఆకులు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. దీనిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా సులభం. ఇంటి లోపల గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఇది ఒక అద్భుతమైన మొక్క. ఫార్మాల్డిహైడ్, బెంజీ, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషాన్ని గాలి నుంచి వేరు చేయడానికి ఇది ప్రసిద్ది చెందింది. ఇది ఆక్సిజన్ కోసం అద్భుతమైన ఇండోర్ ప్లాంట్. అంతేకాదు.. రాత్రి సమయంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.
స్పైడర్ ప్లాంట్..
స్పైడర్ ప్లాంట్.. ఇండోర్ ప్లాంట్స్‌లో మరొక అద్భుతమైన మొక్క. సులభంగా ఇంట్లో పెరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, బెంజీన్లను ఫిల్టర్ చేయడం ద్వారా గాలి నాణ్యతను స్పైడర్ ప్లాంట్ మెరుగుపరుస్తుంది. ఇది ఆక్సిజన్ కోసం అద్భుతమైన ఇండోర్ ప్లాంట్. దీనిలో మరో విశేషం ఏంటంటే.. ఇది సంతోషకరమైన ప్రకంపనలను వ్యాప్తి చేయడానికి మరియు ఆందోళన, ఒత్తిడిని తగ్గించేందుకు సైతం ప్రసిద్ధి చెందిన మొక్క కావడం విశేషం.
అరేకా పామ్..
అరేకా పామ్.. అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన ఇండోర్ ప్లాంట్. గాలి నుంచి హానికరమైన కాలుష్య కారకాలను గ్రహించడానికి ప్రసిద్ది చెందిన మొక్క. గాలిని శుద్ధి చేయడంలో ప్రసిద్ధి చెందిన ఇండోర్ ప్లాంట్. అరేకా పామ్ గాలిని శుద్ధి చేయడానికి మాత్రమే ప్రసిద్ది చెందిన మొక్క కాదు.. పిల్లలు, పిండం యొక్క సరైన అభివృద్ధికి ఈ మొక్క ఎంతగానో సహకరించడం విశేషం. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం ద్వారా నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
తులసి..
ఇక మనందరికీ తెలిసిన తులసి మొక్క. ఈ మొక్క ఆధ్యాత్మికంగానే కాదు.. అద్భుతమైన ప్రయోజనాలున్న మొక్క కూడా కావడం విశేషం. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల మంచి ఆరోగ్యం, అదృష్టం ఇంట్లోకి వస్తుంది. ఇంటిని చెడు నుంచి రక్షించడానికి ఇది ప్రసిద్ది చెందింది. దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు, తులసి మొక్కను మూలికల రాణిగా పిలుస్తారు. తులసి మొక్క వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్కను ఇంటి లోపల ఉంచడం వల్ల ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. ఇది రోజుకు 20 గంటల పాటు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇది గాలి నుంచి కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను కూడా గ్రహించి గాలిని శుభ్రపరుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com