ఇవి తింటే.. కరోనాపై పోరాడొచ్చు!
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఇంతవరకూ ఈ వైరస్‌ను చంపేందుకు ఎలాంటి మందు కనుగొనలేకపోయారు. అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే వ్యాక్సిన్ ఉంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. దానికి వ్యాక్సిన్‌ను లేదు గనుక.. దాన్ని ఎదుర్కోవడంలో ఆయుర్వేదం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు వెల్లడించారు. ఇవి తినడం వల్ల మనిషిలో ఘననీయంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
మన ఇంట్లోనే..!
కాగా.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయుర్వేదాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పిన విషయం విదితమే. మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ప్రతి రోజూ గోరువెచ్చటి నీరు తాగడంతో పాటు యోగాసనాలు, ధ్యానం చేయడం ద్వారా నిరోధక శక్తిని పెంచుకోవచ్చని పేర్కొంది. మరీముఖ్యంగా మన ఇంట్లో ప్రతిరోజూ చేసుకునే వంటల్లో పసుపు, జీలకర్రతో పాటు బెల్లం, తాజా నిమ్మరసం తీసుకోవడం వల్ల కరోనాను ఎదుర్కోవచ్చని పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇక ఆలస్యమెందుకు..
సో.. మొత్తానికి చూస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే మన చేతిలోనే ఉంది.. ఏ ఆయుర్వేద ఆలయంకు పోనక్కర్లేదన్న మాట. ఇక ఆలస్యమెందుకు కుటుంబమంతా ఇలా చేయండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటికి తిరగకుండా.. ఇంట్లోనే ఉండండి. ఒకవేళ పైన చెప్పినవేమీ ఇంట్లో లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకే వచ్చి డెలివరీ చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments