ఇవి తింటే.. కరోనాపై పోరాడొచ్చు!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్ని దేశాలు పోరాడుతున్నాయి. ఇంతవరకూ ఈ వైరస్‌ను చంపేందుకు ఎలాంటి మందు కనుగొనలేకపోయారు. అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలోనే వ్యాక్సిన్ ఉంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. దానికి వ్యాక్సిన్‌ను లేదు గనుక.. దాన్ని ఎదుర్కోవడంలో ఆయుర్వేదం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు వెల్లడించారు. ఇవి తినడం వల్ల మనిషిలో ఘననీయంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

మన ఇంట్లోనే..!

కాగా.. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయుర్వేదాల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పిన విషయం విదితమే. మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా ప్రతి రోజూ గోరువెచ్చటి నీరు తాగడంతో పాటు యోగాసనాలు, ధ్యానం చేయడం ద్వారా నిరోధక శక్తిని పెంచుకోవచ్చని పేర్కొంది. మరీముఖ్యంగా మన ఇంట్లో ప్రతిరోజూ చేసుకునే వంటల్లో పసుపు, జీలకర్రతో పాటు బెల్లం, తాజా నిమ్మరసం తీసుకోవడం వల్ల కరోనాను ఎదుర్కోవచ్చని పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక ఆలస్యమెందుకు..

సో.. మొత్తానికి చూస్తే రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే మన చేతిలోనే ఉంది.. ఏ ఆయుర్వేద ఆలయంకు పోనక్కర్లేదన్న మాట. ఇక ఆలస్యమెందుకు కుటుంబమంతా ఇలా చేయండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటికి తిరగకుండా.. ఇంట్లోనే ఉండండి. ఒకవేళ పైన చెప్పినవేమీ ఇంట్లో లేకపోతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇంటి ముందుకే వచ్చి డెలివరీ చేస్తారు.

More News

‘గేమ్‌ చేంజర్‌’ కోసం ట్రంప్ ఫోన్.. మోదీ ఊహించని షాక్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై అగ్రరాజ్యం అమెరికా కూడా పోరాటం చేస్తోంది. ఇప్పటికే సుమారు 9500 పై చిలుకు మరణాలు సంభవించాయి.

అమెరికాలో పులికి కరోనా.. భారత్‌లో హై అలెర్ట్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మనుషులనే కాదు.. జంతువులనూ వదలట్లేదు. ప్రపంచంలో ఫస్ట్ టైమ్ ఈ మహమ్మారి నాలుగేళ్ల పులికి సోకింది.

ద‌ర్శక నిర్మాత త‌మ్మారెడ్డికి మాతృ వియోగం

టాలీవుడ్ ప్రముఖ ద‌ర్శక నిర్మాత తమ్మారెడ్డి భ‌ర‌ద్వాజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తమ్మారెడ్డి మాతృమూర్తి కృష్ణవేణి (94) సోమ‌వారం కన్నుమూశారు.

రాజీవ్ కనకాల ఇంట విషాదం.. కేన్సర్‌తో సోదరి కన్నుమూత

టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల ఇంట మరో విషాదం నెలకొంది. రాజీవ్ సోదరి, ప్రముఖ టీవీ నటి శ్రీలక్ష్మి గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.

పీఎం సహాయ నిధికి కృష్ణంరాజు ఫ్యామిలీ విరాళం

ప్రపంచమంతా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ సమాజంలోని అన్ని వర్గాల వారు స్పందించాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ నటులు, నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు.