'RRR'కి ముందు రాజమౌళి పరిశీలించిన కాంబినేషన్స్ ఇవే.. అలియా ప్రతి సీన్ లో..
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఇద్దరు బిగ్ స్టార్స్ ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తుండడంతో సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇదీ చదవండి: రుహాని శర్మ హాట్ క్లీవేజ్ క్లిక్.. మతిపోగొట్టేలా శోభిత గ్లామర్ షో
రాజమౌళి తండ్రి, ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు. ఆర్ఆర్ఆర్ కథ అనుకోక ముందు రాజమౌళి ఇద్దరు స్టార్స్ తో సినిమా తీయాలి అని భావించాడు. దీనికోసం రజనీకాంత్, ఎన్టీఆర్.. కార్తీ, సూర్య, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా కాంబినేషన్స్ పరిశీలిస్తున్నాడు.
అలాంటి టైంలో అల్లూరి, కొమరం భీం చరిత్ర రాజమౌళికి గుర్తుకు వచ్చింది. ఇద్దరూ ఒకేటైం లో అజ్ఞాతంలోకి వెళ్లారు కదా.. ఆ పాయింట్ తో సినిమా చేద్దాం అని అన్నాడు. అప్పడు రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ ఫిక్స్ చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఈ మూవీలో అలియా భట్ చరణ్ కి జోడిగా సీతగా నటిస్తోంది. ఆమె కనిపించిన ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుల హృదయాలు కొల్లగొడుతుంది అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఇంత మంచి అమ్మాయి కంట తడి పెట్టకూడదు అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది అని అన్నారు.
విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఆర్ఆర్ఆర్ సమాచారం సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచుతోంది. రాంచరణ్, ఎన్టీఆర్, అలియాతో పాటు అజయ్ దేవగన్, సముద్రఖని, ఒలీవియా మోరిస్, ఇంగ్లీష్ నటులు అలిసన్ డూడి, రే స్టీవెన్సన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడువులైన దోస్తీ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments