Adipurush : చిన్న టీజర్ చూసి సినిమాని అంచనా వేసేస్తారా .. ఆదిపురుష్‌పై కృతిసనన్ వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రం ‘‘ఆదిపురుష్’’. బహుశా ఈ సినిమాకు వచ్చినంత ట్రోలింగ్, విమర్శలు ఏ మూవీకి వచ్చివుండవు. చిన్న టీజర్‌కు దేశం మొత్తం కదిలిపోయింది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌లు చూసి హాలీవుడ్ రేంజ్‌లో ఊహించుకున్నారు ఫ్యాన్స్. అంతేకాదు.. వీటి దెబ్బకు ఆదిపురుష్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తీరా టీజర్ బయటకు వచ్చిందో లేదో అందరి భ్రమలు తొలగిపోయాయి.
ఆదిపురుష్ టీజర్‌పై వెల్లువెత్తిన విమర్శలు:
ఈ చిత్రంలోని రాముడి పాత్రతో పాటు రావణుడు, హనుమంతుడి గెటప్‌లను రామాయణంలో చెప్పినట్లు కాకుండా ఇష్టానుసారంగా తెరకెక్కించడంతో నెటిజన్లు, హిందూ సంఘాలు మండిపడ్డాయి. మరీ ముఖ్యంగా రావణుడి పాత్రను ముస్లిం చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీలా తీర్చిదిద్దారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ మేకర్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా వాయిదా వేశారు.
ఆదిపురుష్‌లో నటిస్తున్నందుకు గర్వంగా వుంది:
ఈ నేపథ్యంలో ఆదిపురుష్‌లో సీత పాత్రలో నటిస్తోన్న కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాను తీస్తున్నందుకు ఇందులో పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు గర్వంగా వున్నారని ఆమె అన్నారు. కేవలం 1.35 నిమిషాల టీజర్ చూసి.. ఒక అంచనాకు రాకూడదని కృతి హితవు పలికారు. భారతీయు పురాణాలు, చరిత్రకు సంబంధించిన కథలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదో అద్భుతమైన అవకాశమని... ఆదిపురుష్‌ను గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు కృతి సనన్ పేర్కొన్నారు. అన్నట్లు... ఆదిపురుష్‌ను 2023 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments