నా గది గోడలనిండా పవన్ ఫోటోలుండేవి: మాధవీలత

  • IndiaGlitz, [Sunday,August 09 2020]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాధవీలత వీరాభిమాని. ఇంతటి అభిమానిగా మారడానికి గల కారణాలను, అలాగే పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎంత వరకూ వర్కవుట్ అవుతుంది అనే విషయాలపై మాధవీలత ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కాలేజ్ డేస్ నుంచే అంటే 17 ఏళ్ల క్రితం నుంచే తాను పవన్‌కు వీరాభిమానని మాధవీలత తెలిపారు. తన గది గోడల నిండా పవన్ ఫోటోలుండేవని ఆమె వెల్లడించారు.

‘‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు మా అమ్మ నా రూమ్‌కి వచ్చేది. నా రూమ్ చూసి.. ‘ఈ రూమ్‌లోకి వస్తే నువ్వొక్కదానివే ఉన్నట్టు అనిపించడం లేదు.. ఓ నలుగురున్న ఫీలింగ్ వస్తోంది’ అనేది. ఎందుకంటే నా గోడల నిండా పవన్ కల్యాణ్ ఫోస్టర్స్ ఉండేవి. నేను ఆయన్ను గౌరవిస్తాను. ఆయన ఐడియాలజీని గౌరవిస్తాను. ఫ్యూచర్‌లో బీజేపీ, పవన్ కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. పవన్ కూడా దేశం కోసం పని చేస్తున్నారు.. బీజేపీ కూడా దేశం కోసం పని చేస్తోంది కాబట్టి ఇద్దరి కాంబినేషన్ తప్పకుండా సక్సెస్ అవుతుంది’’ అని మాధవీలత తెలిపారు.