Nadendla Manohar: జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్ జరిగింది: నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
జగనన్న విద్యాకానుకలో భారీ స్కామ్ జరిగిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనోహర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారని.. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు అయితే 42లక్షల ఆర్డర్లు పెట్టిందని.. మిగిలిన 10లక్షల ఆర్డర్లు డబ్బులు ఎటు పోయాయని ప్రశ్నించారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి రూ.2400 కోట్లు ఖర్చు చేశారన్నారు.
టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయని.. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఈడీ దాడులు చేస్తే ఏపీతో ఉన్న లింక్ బయపడిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి మీదుగా రాయలసీమకు ఇవి చేరాయా? అని నిలదీశారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారు? పిల్లలకు నాసిరకం బూట్లు, బ్యాగ్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. ఎడమ కాలుకి 3వ నెంబర్ సైజ్, కుడి కాలుకి 5వ నెంబర్ సైజ్ షూస్ ఇస్తున్నారు. క్లాస్ వార్ అని చెప్పే సీఎం జగన్.. పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
టోఫెల్, పాలవెల్లువ పథకంలో అవినీతిని జనసేన బయటపెట్టిందన్నారు. జగనన్న విద్యాకానుక పేరుతో ప్రవేశపెట్టిన కిట్స్లోనూ భారీ కుంభకోణం జరిగిందన్నారు. టెండర్లు ఆ ఐదు కంపెనీలకే ఎందుకిచ్చారు? గ్లోబల్ విద్యార్థులను తయారు చేస్తామని మోసం చేస్తున్నారా..? నాడు-నేడులో రూ.16వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారని.. రూ.6వేల కోట్లు గ్రాంట్లు వస్తే రూ.3,550 కోట్లే ఖర్చు చేశారన్నారు. మిగిలిన డబ్బును దారి మళ్లించారని ఆరోపించారు. నిధుల మళ్లింపుపై కేంద్రం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని నాదెండ్ల విజ్ఞప్తి చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments