ఎన్టీఆర్ 30పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం!
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ముగియగానే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. వివరాల మేరకు చిరంజీవి హీరోగా నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాను పోలిన కథతోనే ఎన్టీఆర్ 30 రూపొందనుందని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలంటూ నిర్మాణ సంస్థకు సన్నిహిత వర్గాలు కొట్టి పడేస్తున్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకుంటూనే, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. వేసవి పూర్తి కాగానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్తో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments