Hyderabad Metro:మెట్రో టైమింగ్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. అధికారులు క్లారిటీ..

  • IndiaGlitz, [Saturday,May 18 2024]

ప్రయాణికుల రద్దీ కారణంగా హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పు లేదని.. ఎప్పటిలాగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే సేవలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. అయితే ప్రతి శుక్రవారం రాత్రి 11:45 గంటల వరకు.. అలాగే ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందన్నారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు.

ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ వంటి వాటిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్ల టైమింగ్స్ విషయంలో ప్రయాణికులెవరూ అయోమయానికి గురి కావొద్దని కోరారు. ఇప్పటిలా యథావిధిగా నిర్దిష్ట సమయానికే రాకపోకలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. కాగా మెట్రో టైమింగ్స్ మారాయని.. ప్రతిరోజూ రాత్రి 11:45 గంటల వరకూ చివరి రైలు అందుబాటులో ఉంటుందని.. ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే రాకపోకలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నట్లు ఎల్‌ అండ్‌ టి సంస్థ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో ఆర్‌.శంకర్‌ రామన్‌ ఇటీవల ప్రకటించారు. 2026 తర్వాత మెట్రో రైలు విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కారణంగానే మెట్రో నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్టు శంకర్ రామన్ తేల్చి చెప్పారు. ఫ్రీ బస్సు పథకంతో మెట్రో ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ కూడా దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు.

ప్రాధాన్యంలేని వ్యాపారాల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపించట్లేదన్నారు. మరోవైపు క్యాబ్ సర్వీసులు పెరగడం కూడా మెట్రోపై ప్రభావం చూపుతోందన్నారు. మెట్రో నిర్వహణకు సంబంధించి మరో 65 ఏళ్లు రాయితీలు ఉన్నాయని.. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీంతో ఎల్‌ అండ్ టి సంస్థ నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మెట్రో నిర్వహణ నుంచి వైదొలగాలి అనుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మరో కార్పొరేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటామని తేల్చిచెప్పారు.

More News

Chiru, Bunny:ఒకే వేదికపై చిరు, బన్నీ, ప్రభాస్.. టీజీ సీఎం రేవంత్ రెడ్డి కూడా..!

తెలుగు సినీ ప్రేక్షకుల‌కు శుభవార్త. ద‌ర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA)

Renu Desai: పవన్ కల్యాణ్‌కు నాలాగా ప్రేమ లేదు.. ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఆగ్రహం..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌, మాజీ హీరోయిన్ రేణు దేశాయ్‌తో విడాకులు తీసుకుని సంవత్సరాలు గడుస్తున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎవరి జీవితం వాళ్లు లీడ్ చేస్తున్నారు.

Sharmila: దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా సుప్రీంకోర్టు తీర్పు: షర్మిల

ఏపీలో పోలింగ్ ముగిసే దాకా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ఫుల్ యాక్టివ్‌గా ఉండేవారు. ఆమె చేసే ప్రతి ప్రచారం కార్యక్రమం వివరాలతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనపై

Chandu:పవిత్ర నన్ను పిలుస్తోంది అంటూ పోస్టింగ్‌లు.. సీరియల్ నటుడు చందు ఆత్మహత్య...

తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో

CM Jagan:సీఎం జగన్ లండన్ పర్యటన.. ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి కలకలం

ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్న సమయంలో తీవ్ర కలకలం రేగింది. లండన్ వెళ్లేందుకు జగన్ తన కుటుంబంతో గన్నవరం ఎయిర్‌పోర్టు వచ్చిన సమయంలో