అప్పుడు మైనస్ ఇప్పుడు ప్లస్
Send us your feedback to audioarticles@vaarta.com
అభిరుచి గల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్. ‘చిన్నోడు పెద్దోడు’, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘ఊయల’, ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ లాంటి విజయవంతమైన చిత్రాలతో నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ‘సమ్మోహనం’ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది.
అదేమిటంటే.. ఈ సినిమా విడుదలైన జూన్ 15నే 17 ఏళ్ళ క్రితం బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ నిర్మించిన ‘భలేవాడివి బాసూ!’ రిలీజైంది. అప్పట్లో ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కట్ చేస్తే.. ఇప్పుడు అదే తేదీకి ‘సమ్మోహనం’ సినిమాని విడుదల చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది. అంటే.. ఒకే తేది ఒకసారి మైనస్ రిజల్ట్ ఇస్తే.. మరోసారి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com