అప్పుడు లెక్చరర్.. ఇప్పుడు ప్రొఫెసర్
Send us your feedback to audioarticles@vaarta.com
25 ఏళ్ల క్రితం కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సుందరకాండలో లెక్చరర్‌గా విక్టరీ వెంకటేష్ చేసిన సందడి అంత సులువుగా మరచిపోలేం. ఘనవిజయం సాధించిన ఆ చిత్రంతో వెంకటేష్ కి నటుడిగా మరింత గుర్తింపు వచ్చింది. కట్ చేస్తే.. పాతికేళ్ల తరువాత ప్రొఫెసర్ పాత్రలో సందడి చేసేందుకు ఈ సీనియర్ కథానాయకుడు సిద్ధమవుతున్నారు.
కాస్త వివరాల్లోకి వెళితే.. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో చాన్నాళ్ల తరువాత విజయాన్ని అందుకున్న సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ ఓ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారట.
ఆద్యంతం అలరించేలా ఈ పాత్రని తేజ డిజైన్ చేసుకున్నారని.. ఇందులో వెంకటేష్ లుక్, మేనరిజమ్స్.. ఇలా అన్ని కూడా డిఫరెంట్‌గా ఉంటాయని తెలిసింది. ఆటా నాదే వేటా నాదే అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాని వెంకటేష్ పుట్టినరోజైన డిసెంబర్ 13న ప్రారంభించనున్నారు.
ఈ చిత్రంలో వెంకీకి జోడీగా కేరళకుట్టి నిత్యా మీనన్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com