అప్పుడు అంజలి..ఇప్పుడు తాప్సీ..

  • IndiaGlitz, [Thursday,August 17 2017]

హాస్య‌న‌టుడుగా త‌నదైన ముద్ర వేసిన శ్రీ‌నివాస‌రెడ్డి.. అప్పుడ‌ప్పుడు క‌థానాయ‌కుడు స్థాయి పాత్ర‌ల్లో ప‌ల‌క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల క్రితం అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన 'గీతాంజ‌లి'లో శ్రీ‌నివాస‌రెడ్డి పోషించిన పాత్ర‌ క‌థకి కీల‌కం. ఇక గ‌తేడాది 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా'తో క‌థానాయ‌కుడుగా ప‌ల‌క‌రించి.. ఫ‌ర‌వాలేద‌నిపించాడు. ఇప్పుడు మ‌ళ్లీ 'ఆనందోబ్ర‌హ్మ‌'లో మ‌రోసారి ముఖ్య భూమిక పోషించాడు. ఈ చిత్రం రేపు విడుద‌ల కానుంది. విశేష‌మేమిటంటే.. శ్రీ‌నివాస‌రెడ్డి ముఖ్య పాత్ర‌లో న‌టించిన 'గీతాంజ‌లి' ఏ ఆగ‌స్టు నెల‌లో విడుద‌లైందో.. అదే నెల‌లో 'ఆనందోబ్ర‌హ్మ' కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం.

'గీతాంజ‌లి' చిత్రంలో అంజ‌లి లాంటి టాప్ హీరోయిన్తో క‌లిసి న‌టించి త‌న ఖాతాలో ఓ హిట్ వేసుకున్న శ్రీ‌నివాస రెడ్డి.. ఈ సారి 'ఆనందోబ్ర‌హ్మ‌'లో తాప్సీ లాంటి మ‌రో స్టార్ హీరోయిన్‌తో క‌లిసి సంద‌డి చేస్తున్న వైనం ఆగ‌స్టు నెల సాక్షిగా క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నాడ‌ట‌. ఆల్ ది బెస్ట్ శ్రీ‌నివాస‌రెడ్డి!