ట్రైలర్ టాక్: పెళ్లి చుట్టూ తిరిగే 'తెల్లవారితే గురువారం'
Send us your feedback to audioarticles@vaarta.com
'మత్తు వదలరా' చిత్రంతో డీసెంట్ సక్సెస్‌ను అందుకున్న శ్రీసింహ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం 'తెల్లవారితే గురువారం'. మార్చి 27న విడుదలవుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. హీరో(శ్రీసింహ)కి వాళ్లింట్లో పెళ్లి ఫిక్స్ చేయడం. అది ఇష్టం లేని హీరో.. ఇంటి నుంచి పారిపోవాలనుకుంటాడు. తనకు పెళ్లి ఇష్టం లేదనే విషయాన్ని తన స్నేహితులైన(వైవా హర్ష, సత్య) చెబుతాడు. స్నేహం కోసం వాళ్లు ఇంట్లో ఏవేవో కబుర్లు చెబుతూ కవర్ చేస్తుంటారు. మరో వైపు హీరో లవ్‌ట్రాక్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్స్‌గా నటించారు. అజయ్ నెగటివ్ షేడ్‌లో కనిపించాడు. ఇంతకీ హీరోఎందుకు పెళ్లి వద్దనుకుంటాడు? ఇద్దరి హీరోయిన్స్‌లో హీరో ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? అనే అంశాలతో సినిమా రూపొందినట్లు ఓ రాత్రిలో జరిగిన కథాంశంతో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.
మణికాంత్ గెల్లి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాయి కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలనే కథలతో కాకుండా ఎంటర్‌టైనింగ్ కథతో శ్రీసింహ చేసిన 'తెల్లవారితే గురువారం' సినిమా అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com