వారి నటన నన్నెంతగానో ఆకట్టుకుంది: రామ్‌చరణ్
Send us your feedback to audioarticles@vaarta.com
సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియావర్క్స్, మహాయాణ పిక్చర్స్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్‌గా విడుదలై సూపర్‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులను ఈ చిత్రం దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ చిత్ర యూనిట్‌కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
‘‘రీసెంట్‌గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్‌గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరిగారు సహా ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’ అన్నారు రామ్ చరణ్. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ నటించిన చిత్రం ‘మహేశింతే ప్రతీకారమ్’కు ఇది రీమేక్.
#UmaMaheshwaraUgraRoopasya is one film I absolutely loved. The film stays true to it's content and I'm bowled over by the captivating performances of @ActorSatyaDev, @ItsActorNaresh garu, @ActorSuhas, Hari Chandana and Roopa. You've drawn the best from your team @mahaisnotanoun.
— Ram Charan (@AlwaysRamCharan) August 10, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments