అదిరిపోయిన మహేష్ మేనల్లుడి 'హీరో' ట్రైలర్ .. అశోక్ గల్లా లుక్స్ అదుర్స్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలా ఎక్కడ చూసినా వారసుల ఎంట్రీలు మళ్లీ ఊపందుకున్నాయి. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతల కొడుకులు, కూతుళ్లు, అల్లుల్లు , ఇతర బంధువర్గం వెండితెర మీద అడుగుపెడుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన ‘‘రౌడీ బాయ్స్’’ విడుదలకు సిద్ధమైంది. ఇక తాజాగా సూపర్‌స్టార్ మహేశ్ మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండితెరకు పరిచయమవుతున్నారు.
'హీరో' అనే సినిమాతో అశోక్ లాంచ్ అవుతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'కళ్లలో బిర్యాని వండుకుంటే వాస్తవంలో కడుపు నిండదురా' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. చివర్లో చెప్పిన 'క్రియేటివ్ పీపుల్ కథ చెప్పరు' అనే డైలాగ్ బాగుంది. అయితే ట్రైలర్‌లో కథ గురించి ఏ చిన్న క్లూ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్. కాకపోతే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో మాత్రం క్లారిటీ ఇచ్చారు.
లవ్, కామెడీ, యాక్షన్ సన్నివేశాలతో సినిమా సాగేలా కనిపిస్తోంది. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తోన్న ‘‘హీరో’’లో అశోక్ పక్కన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments