మార్చి 2 నుండి దక్షిణాదిన థియేటర్స్ బంద్
- IndiaGlitz, [Friday,February 23 2018]
ఎప్పటి నుండో సినిమా నిర్మాత సంఘాలకు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు మధ్య కోల్డ్‌వార్‌కు తెరపడింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ అధిక చార్జీలు వసూలు చేస్తున్నారంటూ నిర్మాతల సంఘం నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో నిర్మాతల సంఘాలు.. దక్షిణాది నిర్మాతల మండలి మార్చి 2 నుండి థియేటర్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. దీని ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులో వేలాది థియేటర్స్ బంద్ కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే 2400 థియేటర్స్ ఉండటం గమనార్హం.